బండి భగీరథ్‌ను మూడవ రోజు ప్రశ్నిస్తున్న పోలీసులు

పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను పోలీసులు వరుసగా మూడో రోజు కూడా ప్రశ్నిస్తున్నారు. పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో సాయంత్రం వరకు అతణ్ని విచారించనున్నారు. మూడు రోజుల పోలీస్‌ కస్టడీ ముగియనుండటంతో సాయంత్రం కోర్టులో హాజరు పర్చనున్నారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలిస్తారు. బాధితురాలితో ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, స్నాప్‌చాట్‌లలో చాటింగ్‌లకు సంబంధించిన ఆధారాలతో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్