హైదరాబాద్‌లోని కొంపల్లిలో ‘కొంపల్లి దాండియా 2026 – సీజన్ 3’ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం హోటల్ కాస్‌లో ఆవిష్కరించారు. Golden Key Mayura Sriven సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 16, 17, 18 తేదీల్లో ప్రతిరోజూ సాయంత్రం 7 నుంచి రాత్రి 11:30 గంటల వరకు నార్త్ NCL సమీపంలోని K-Town Arenaలో దాండియా వేడుకలు జరగనున్నాయి. లైవ్ ఢోల్, డీజే, గర్బా బ్యాండ్, భారీ డెకరేషన్, ఫుడ్ కౌంటర్లు, ఫ్లీ మార్కెట్, సెలబ్రిటీ విజిట్స్, ఫొటోబూత్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉంటాయి. లక్కీ డ్రా ద్వారా స్కూటర్‌తో పాటు బహుమతులు కూడా అందించనున్నారు.