కుత్బుల్లాపూర్: ఓ ఫ్లాట్ విషయంలో ఇరువర్గాల మధ్య కట్టెలతో గొడవ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సురారం పీయస్ కృషికాలనీలో 132గజాల ఓ ప్లాట్ విషయంలో ఇరువర్గాల దాడి చేసుకున్నారు. స్వరాజ్యం(29), చైతన్య, లక్ష్మీ, అనూషతో పాటు మరికొంతమందిపై కర్రలు బండలు, డ్రమ్ములతో ఓ వర్గం దాడి చేశారు. ఈ దాడిలో పల్లపు వీర్యయ్య అనే వ్యక్తికి తీవ్రగాయాలు అవ్వడంతో హాస్పిటల్ కి తరలించారు. స్వరాజ్యం అనే మహిళ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్