కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి పారిశ్రామికవాడలో సోమవారం షెడ్ మీద నుండి పడి వ్యక్తి మృతి చెందాడు. జగదాంబ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షెడ్ కి రేకులు ఫిట్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడి అన్సార్ (28) అనే కార్మికుడు మృతి చెందాడు. షడ్ నిర్మాణం చేస్తున్నారు అంటే దానికి తగిన విధంగా సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.