కుత్బుల్లాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం యుఎస్ఎఫ్ఐ మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ఏర్పడిన సమస్యలను తక్షణమే పరిష్కరించి, కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.