కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం విశ్వకర్మ కాలనీలో రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. రామ్ దేవ్ రావు హాస్పిటల్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్ ఫౌండేషన్ చైర్మన్ సిరాజ్ గద్ద, వి. ఆర్ ప్రమోటర్స్ ఎండీ రవి కుమార్ పాల్గొన్నారు. పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.