తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లేబర్ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా వీరబొమ్మ రమేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా అల్లాడి మహేష్ గుప్తా ఆయనకు బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. రమేష్ సేవా నిబద్ధత, కార్మికుల పట్ల అంకితభావానికి ఇది గుర్తింపు అని, కార్మికుల సమస్యల పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు ఆయన మరింత సమర్థవంతంగా కృషి చేస్తారని మహేష్ గుప్తా విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్, కుత్బుల్లాపూర్ కేంద్రంగా ఈ నియామకం జరిగింది. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.