సార్-2026 ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పరిశీలన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 డివిజన్‌లో జరుగుతున్న సార్-2026 ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని టిపిసిసి రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్, డిసిసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సెక్రెటరీ మొహమ్మద్ జాకీర్ పరిశీలించారు. ఆయన అసిస్టెంట్ కమిషనర్, జిహెచ్ఎంసి సూపర్వైజర్, బిఎల్ఓ లు, బిఎల్ఎ లతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాల ధృవీకరణ ప్రక్రియను పర్యవేక్షించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా సూచనలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్