కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాల్లో దారిదోపిడీలకు పాల్పడుతున్న అనిల్, నవీన్ అనే ఇద్దరు పాత నేరస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు, స్మార్ట్‌ఫోన్, ఉంగరం, మోటార్‌సైకిల్‌తో సహా సుమారు ₹5 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. హెచ్ఎంటి అటవీప్రాంతంలో రాత్రివేళ వాహనదారులను బెదిరించి దోపిడీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.