బుధవారం సాయంత్రం జగద్గిరిగుట్ట బసిస్టాపులో ఇద్దరు రౌడీషీటర్ల మధ్య జరిగిన గొడవలో రోషన్ అనే యువకుడిపై బాలరాజు అనే రౌడీషీటర్ కత్తితో హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.