కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన పలు డివిజన్ అధ్యక్షులు మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిలో జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షురాలు మాదిరెడ్డి హైమావతి రెడ్డి, బౌరంపేట్ డివిజన్ అధ్యక్షులు అర్కల విజయ్ గౌడ్, దూలపల్లి డివిజన్ అధ్యక్షులు బైరి శివ కుమార్ గౌడ్, రంగారెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షులు జలీల్ ఖాన్, గణేష్ నగర్ డివిజన్ అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ, దుండిగల్ డివిజన్ అధ్యక్షులు జక్కుల మల్లేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.