Sir ఓటు మ్యాపింగ్ కార్యక్రమంలో పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో గల బెజ్జంకి మండలం గుగ్గిలం గ్రామం, తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ గ్రామంలో ఎస్‌ఐఆర్ (SIR) ఓటు మ్యాపింగ్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా రీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, గ్రామంలోని ఓటరు జాబితాను పరిశీలించి, ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్, మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్