శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని వర్షిత సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ కు చెందిన మధుసూదన్ రెడ్డి కూతురైన వర్షిత, శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. హాస్టల్ నిర్వాహకుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్