కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు తమ సామాజిక, ప్రజా సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ కి మంగళవారం వారి నివాసంలో అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కూన శ్రీశైలం గౌడ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.