కళాశాలలో బీటెక్ విద్యార్థినిపై యువకుల అఘాయిత్య యత్నం.. ఒకరు అరెస్ట్

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో మూడవ సంవత్సరం బీటెక్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు వేధింపులకు పాల్పడి, అఘాయిత్యానికి ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు, ఆశిష్ అనే విద్యార్థి 2024 సంవత్సరం నుంచి తన కుమార్తెను వేధిస్తున్నాడని పేర్కొన్నారు. పోలీసులు ఆశిష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా, ప్రవీణ్ అనే మరో యువకుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడిన బాధితురాలు, నిందితులు బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులే కావడం గమనార్హం. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్