శ్రీనివాస్ నగర్‌లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్కిల్ పరిధి శ్రీనివాస్ నగర్‌లో తెలంగాణ రక్షణ సేన జెండాను నాయకురాలు పడాల మనోజ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత, ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితమ్మ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్