గౌడ సంక్షేమ సంఘం బలోపేతమే లక్ష్యం

కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పరుచూరి సురేష్ గౌడ్‌ను జిల్లా నాయకత్వం ఘనంగా సత్కరించింది. జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు గట్టు రామచంద్రరావు, గుండాల మల్లేష్ గౌడ్ ఆదేశాలతో సంఘాన్ని బలోపేతం చేస్తామని సురేష్ గౌడ్ తెలిపారు. గీత కార్మికుల ఇన్సూరెన్స్, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గౌడ యువకులు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇదే వేదికపై యువనేత ఉప్పల సాయి గౌడ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు బెల్లంకొండ జ్యోతి గౌడ్, యాకే గౌడ్, నర్సింహా గౌడ్, వెంకటేష్ గౌడ్, కృష్ణవేణి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕