ఒకే రోజు ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

రాష్ట్రంలో ఒకే రోజు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. బాచుపల్లి శ్రీచైతన్య జూ. కాలేజీలో ఇంటర్ విద్యార్థిని వర్ష, నిజాంపేట ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి మంజునాథ్, ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ విభాగం విద్యార్థి విజ్ఞాన్ ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వ్యవహారంలో అమ్మాయి తల్లి వార్నింగ్ ఇవ్వడంతో మంజునాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మిగిలిన విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్