కేటీఆర్ పర్యటనలో విషాదం.. కెమెరామెన్ గుండెపోటుతో మృతి

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ జీడిమెట్ల ప్రాంతంలో మంత్రి కేటీఆర్ పర్యటనను చిత్రీకరిస్తున్న సమయంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒక టీవీ ఛానెల్‌లో పనిచేస్తున్న కెమెరామెన్ దామోదర, గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, చికిత్స పొందుతూ దామోదర మృతి చెందారు. ఈ ఘటన మంత్రి పర్యటనలో కలకలం సృష్టించింది.

సంబంధిత పోస్ట్