కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమాలు మంగళవారం ముగిశాయి. 6 నెలల శిక్షణను 86 మందిలో 85 మంది బీట్ ఆఫీసర్లు, 3 నెలల పదోన్నతి శిక్షణను 44 మంది సెక్షన్ ఆఫీసర్లు విజయవంతంగా పూర్తి చేశారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ అధికారి సువర్ణ, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ వినయ్ కుమార్ హాజరయ్యారు. అకాడమీ డైరెక్టర్ ప్రియాంకా వర్గేసే శిక్షణ నైపుణ్యాలను క్షేత్రస్థాయిలో వినియోగించాలని సూచించారు. అటవీ సంరక్షణలో బీట్, సెక్షన్ ఆఫీసర్ల పాత్ర కీలకమని అధికారులు తెలిపారు.