ట్రాన్స్ఫార్మర్ ప్రమాదం – లైన్మెన్ నాగబాబు తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ట్రాన్స్‌ఫార్మర్‌పై మరమ్మత్తులు చేస్తుండగా లైన్‌మెన్ నాగబాబు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. షాక్ తీవ్రతకు ఆయన శరీరం కాలిపోయి, ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల్లో ఉన్నట్లు సమాచారం. గత పది రోజుల్లో ఇదే తరహాలో జరిగిన రెండో ఘటన ఇది. గతంలో బహదూర్‌పల్లిలో శ్రీనివాసరావు అనే లైన్‌మెన్ ఇలాగే విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఈ తాజా ఘటనతో విద్యుత్ శాఖ సిబ్బందిలో తీవ్ర ఆందోళన నెలకొంది.

సంబంధిత పోస్ట్