హైదరాబాద్, కుత్బుల్లాపూర్‌లోని నిజాంపేట్‌లో శ్రీ వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన వేడుకల్లో చైతన్విక డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. నృత్య గురువు సాయి ప్రియచైత్ శిక్షణలో చిన్నారులు సంప్రదాయ నృత్యాన్ని అద్భుతమైన హావభావాలతో ప్రదర్శించారు. ఈ సందర్భంగా భరతనాట్యం తదితర నృత్య ప్రదర్శనలు కూడా నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు నృత్య గురువు సాయి ప్రియచైత్‌ను సత్కరించారు. సంప్రదాయ కళలను ప్రోత్సహించడమే ఈ ప్రదర్శన లక్ష్యమని తెలిపారు.