కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్ వార్డు కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని దుండిగల్ సర్కిల్ బీజేపీ అధ్యక్షుడు పీసరి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరి అని, 'నిండు జీవితానికి రెండు చుక్కలు' నినాదాన్ని గుర్తుంచుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల భవిష్యత్తు కోసం పోలియో చుక్కలు వేయించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని ఆయన కోరారు.