కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. డీసీపీ కార్యాలయం సమీపంలోని హెచ్ఎంటి గ్రౌండ్లో అపస్మారక స్థితిలో ఉన్న ఓ మగ వ్యక్తిని స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీ గదిలో ఉంచారు. ఈ వ్యక్తి గురించి సమాచారం తెలిసిన వారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.