మేడ్చల్ జిల్లాలోని మనోహరబాద్ మండలంలోని పోతారం గ్రామంలోని యూపీఎస్ పాఠశాలలో గ్రామ సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏక రూప దుస్తులను బుధవారం పంపిణీ చేశారు. ఈ దుస్తుల పంపిణీ ద్వారా పాఠశాలలో ఆర్థిక అసమానతలను తొలగించవచ్చని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ మాధవి, సిఏ దుర్గం కవిత తదితరులు పాల్గొన్నారు.