యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని యూఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ పిలుపునిచ్చారు. డ్రగ్స్, గంజాయి, గుట్కా, మద్యం వంటివి ఆరోగ్యాన్ని, చదువును, కుటుంబాలను నాశనం చేస్తాయని, క్షణిక ఆనందం కోసం జీవితాన్ని పణంగా పెట్టవద్దని ఆయన సూచించారు. క్రీడలు, కళలు, చదువుపై దృష్టి పెట్టి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని కోరారు. ఈ పిలుపు హైదరాబాద్, కుత్బుల్లాపూర్ ప్రాంతంలో యువతలో చర్చనీయాంశమైంది.