హైదరాబాద్, కుత్బుల్లాపూర్ లోని ప్రగతి నగర్ ఎలిఫెంట్ సర్కిల్ వద్ద బుధవారం మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజా సంక్షేమం కోసం చేసిన సేవలను, కృషిని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో సాంబశివరెడ్డి, అల్లాడి మహేష్ గుప్తా, ఏవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.