శంషాబాద్ సర్కిల్ పరిధిలో ఆదివారం ఓ మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. గచ్చిబౌలికి చెందిన మహిళ రూ.60 వేలు నగదుతో క్యాబ్ ఎక్కగా, డ్రైవర్ కొత్వాల్‌గూడ సమీపంలో నిర్జన ప్రాంతంలోకి రాగానే కారు ఆపాడు. వాహనంలోనే మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలు బయటకు దిగి కేకలు వేయడంతో భయపడిన డ్రైవర్ నగదు బ్యాగ్‌తో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.