కోకాపేటలోని ఓ విల్లాలో భోజనం విషయంలో జరిగిన గొడవ ఓ డ్రైవర్ ప్రాణాలను బలిగొంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పీనుమల్ల కార్తీక్ (35) అనే డ్రైవర్‌ను, అదే ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న షేక్‌బాషా (43) కత్తితో పొడిచి చంపాడు. శనివారం రాత్రి భోజనం వడ్డించమని అడిగినందుకు జరిగిన వాగ్వాదం ఈ ఘాతుకానికి దారితీసింది. తీవ్రగాయాలతో కార్తీక్ అక్కడికక్కడే మరణించాడు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు షేక్‌బాషాను రిమాండ్‌కు తరలించారు. మృతుడికి భార్య, పాప ఉన్నారు.