హైదరాబాద్‌లో పోలీసుల పేరుతో సోషల్ మీడియాలో నకిలీ వీడియోలు సృష్టించి ప్రచారం చేసిన నిందితుడిని రాజేంద్రనగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాలపత్తర్ పోలీసులతో కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో మైలార్‌దేవపల్లి పరిధిలో నిందితుడు మహమ్మద్ అబూబకర్ అలీ తబస్సుమ్ (27)ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఏఐ సాఫ్ట్‌వేర్ సహాయంతో తనను పోలీసు అధికారిగా చూపిస్తూ, ఆయుధాలతో వీడియోలు రూపొందించి ముఖ్యంగా Instagramలో పోస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియోల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేశాడు.