శంషాబాద్‌లో భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం (వీడియో)

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. శంషాబాద్, ఆరాంఘర్ పరిసరాల్లో మోకాళ్ల లోతు నీరు చేరడంతో జాతీయ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఊహించని ఈ జలదిగ్బంధంతో వాహనదారులు, రోడ్డు పక్కన దుకాణాల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపుల్లోకి నీరు చేరడంతో వ్యాపారులు మోటార్లతో నీటిని బయటకు పంపేందుకు శ్రమిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే రహదారులు, ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కూడా జలమయమయ్యాయి.

సంబంధిత పోస్ట్