శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక వ్యక్తి ఎయిర్ హోస్టర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన చోటు చేసుకుంది. ఉదయ్‌పూర్‌కు చెందిన ప్రవీణ్ సింగ్ రాథోడ్ వ్యాపార పనుల నిమిత్తం కోయంబత్తూర్ వెళ్లి తిరిగి కనెక్టింగ్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. విమాన సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, సెల్‌ఫోన్‌లో వీడియో తీయడానికి ప్రయత్నించినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.