హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడి వద్ద ఉన్న పవర్ బ్యాంక్ పేలింది. దీంతో విమానంలో మంటలు చెలరేగి, పొగలు వ్యాపించాయి. క్యాబిన్ నుండి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది పొగలను గమనించి, ప్రయాణికులను సురక్షితంగా కిందకి దించారు. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది.