మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గాహిల్స్ ప్రాంతంలో ఎర్రోళ్ల వంశీయాదవ్ (37) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వంశీయాదవ్, శ్రావ్య దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.