శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పలు విమానాల రాకపోకలు ఆలస్యం

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలు ఆలస్యం కావడంతో శబరిమల వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దిల్లీ, మదురై, బెంగళూరు, గోవా, కోల్‌కతా, భువనేశ్వర్‌ వెళ్లాల్సిన కొన్ని విమానాలు రద్దయ్యాయి. గోవా, అహ్మదాబాద్‌, మదురై, బెంగళూరు, దిల్లీ, భువనేశ్వర్‌, చెన్నై నుంచి శంషాబాద్‌కు రావాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయని అధికారులు తెలిపారు. ఎయిర్‌లైన్స్‌ ఆపరేషనల్‌ ఇష్యూస్‌ కారణంగా ఈ అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్