ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టు రోడ్డులో ఆదివారం చోటు చేసుకుంది. మంటలను గమనించి అప్రమత్తమైన డ్రైవర్ కారులో ఉన్న ప్రయాణికులను కిందకి దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఏమీ అవ్వకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.