రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో మహానేత, స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ వెంకటేష్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడని కొనియాడారు. ఆయన విలువలు, ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.