తల్లి మృతిని తట్టుకోలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య

మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కండేయ నగర్‌లో కొమురా రెడ్డి (27) అనే ఆటో డ్రైవర్ మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు నెలల క్రితం తల్లి మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురై, మద్యానికి బానిసైన ఆయన తన నివాసంలో ఉరివేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్