కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) జూనియర్ టెలికాం ఆఫీసర్ (టెలికాం) కేడర్‌లో 100 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ సర్కిల్‌లో 2, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 1 పోస్టులు ఉన్నాయి. బీఈ, ఎంఎస్సీ, ఎంటెక్ అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 4, 2026 నుంచి జులై 3, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 2026 జులై 3 నాటికి 20 నుంచి 30 ఏళ్లు ఉండాలి. జనరల్, ఓబీసీలకు రూ.2,000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.1,000 దరఖాస్తు రుసుము. ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది. జీతం నెలకు రూ.16,400 నుంచి రూ.40,500 వరకు ఉంటుంది.