హైదరాబాద్ సిటీ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్, ఎస్. ఆర్. నగర్ పోలీసులు సంయుక్తంగా నేచర్ క్యూర్ హాస్పిటల్ వద్ద దాడి చేసి, నిషేధిత మత్తుపదార్థమైన ఎండు గంజాయిని అక్రమంగా కలిగి ఉన్న ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి 158 కిలోల ఎండు గంజాయి, ఒక కారు, మూడు స్మార్ట్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.