వందే భారత్ ఎక్స్ప్రెస్ కు అదనపు కోచ్లు: ప్రయాణికులకు ఊరట

విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు కోచ్లను జోడించారు. ప్రస్తుతం 16 కోచ్లతో నడుస్తున్న ఈ రైలులో ఇప్పుడు 20 కోచ్లు ఉంటాయి. దీనివల్ల సీట్ల సంఖ్య పెరిగి, టికెట్ లభ్యత మెరుగుపడి ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం లభించనుంది. రైల్వే శాఖ ఈ చర్యతో ప్రయాణ సౌలభ్యం పెరుగుతుందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్