అమీర్‌పేటలో పాదచారులు, వాహనదారులకు ఇబ్బంది కలిగించే కాలిబాట అక్రమ దుకాణదారులపై సనత్‌నగర్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తాత్కాలికంగా అక్రమ దుకాణదారుల వస్తువులను ట్రాఫిక్ పోలీసులు జప్తు చేశారు. వాహనదారులకు ఇబ్బందులను కలిగించరాదని సనత్‌నగర్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. 'ట్రాఫిక్ నియమాలు పాటించండి. క్షేమంగా ఇంటికి వెళ్ళండి' అని పోలీసులు సూచించారు.