సృష్టి కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నమ్రతను శుక్రవారం గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు. ఐదు రోజుల పాటు విచారణ జరగనుంది. నమ్రతా మీడియాతో మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఆర్మీ వ్యక్తి తప్పుడు ఆరోపణలతో తనపై కేసు పెట్టాడని తెలిపింది. త్వరలోనే నిజాలు బయటపడతాయని వ్యాఖ్యానించింది.