ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆలయానికి ఆదివారం తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు శ్రద్ధాభక్తులతో బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేశారు.