బేగంపేట్ లోని స్ట్రీట్ నెంబర్-4లో డ్రైనేజీ ఓవర్ స్లో అవుతోంది. దీంతో రోడ్డుపై మురుగునీరు చేరి దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోయారు. రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ఇబ్బందికరంగా మారిందన్నారు. అలాగే మురుగునీరు నిచ్చెన దోమల బెడద కూడా ఎక్కువ అయిందన్నారు. సమస్యపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. అలాగే సమస్యలు మరల పునరావృతం కాకుండా చూడాలన్నారు.