అమీర్‌పేటలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రెండో అంతస్తులోని ఎంఎస్‌ఆర్‌ ఫ్యాషన్స్‌ దుకాణంలో మంటలు చెలరేగి, క్రమంగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దుకాణాల్లోని వారిని సురక్షితంగా బయటకు తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్