పేద విద్యార్థుల స్కాలర్‌షిప్‌లపై ప్రభుత్వం సానుకూలం: భట్టి

రాష్ట్రంలోని పేద విద్యార్థుల స్కాలర్‌షిప్ నిధుల సమస్యపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ప్రజాభవన్‌లో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా త్వరలోనే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్