హైదరాబాద్: ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్ (వీడియో)

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పోర్ట్స్ మ్యాన్ అవతారమెత్తారు. MLAలు, MLCల స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఆయన ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు. పలువురు MLAలు, విద్యార్థులతో సరదాగా ఆడి సందడి చేశారు. ఈ క్రమంలో తన టీమ్ తరఫున ఆయన 4 గోల్స్ సాదించారు. దీంతో సహచర ప్లేయర్లు ఆయనను భుజాలపై ఎత్తుకొని అభినందించారు. ఈ మ్యాచులో CM టీమ్ గెలిచింది. ఇక్కడ 2 రోజుల పాటు ప్రజాప్రతినిధుల ఆటలపోటీలు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్