సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ఇంటికి వెళ్ళినప్పుడు మహిళలు తిట్టిన తిట్లకు తానుంటే హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేవాడినని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజలు ఇప్పటికే రెండున్నరేళ్లు వేచి చూశారని, మరో రెండున్నరేళ్ళు కూడా ఓపిక పడతారని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చే యాభై ఏళ్ల వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అనే మాటే వినిపించదని తలసాని స్పష్టం చేశారు.