రాజకీయాల్లో నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుంది: హరీష్

రాజకీయాల్లో నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు. సోమవారం బీఆర్ఎస్ భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను రాజకీయాలకు అనర్హుడిని కాదని, భట్టి విక్రమార్కనే అనర్హుడని ఆయన అన్నారు. సచివాలయంలో ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నాలు చేయడం చరిత్రలో ఎన్నడైనా ఉందా అని ప్రశ్నించారు. బిల్లులు చెల్లించడానికి 20-30% కమిషన్ తీసుకోలేదని, అందులోనే తాను అనర్హుడిని కావచ్చని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్